బెంగుళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121) సెంచరీలు బాదడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది.
మార్ష్, వార్నర్ విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు మార్ష్(121; 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులు), వార్నర్(163; 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సులు) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి నుంచే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడి.. తొలి వికెట్‌కు ఏకంగా 259 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఒకానొక సమయంలో ఆసీస్ స్కోర్ 400 దాటుతుందని అనిపించినా.. వీరిద్దరూ వెనుదిరిగాక స్కోర్ బోర్డు మందగించింది. చివరలో షాహీన్ ఆఫ్రిది, హారిస్ రౌఫ్ వరుస విరామాల్లో వికెట్లు తీసి 400 దాటకుండా కట్టడి చేయగలిగారు.
పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది 5 వికెట్లు తీసుకోగా.. హారిస్ రౌఫ్ 3, ఉసామా మీర్ ఒక వికెట్ తీసుకున్నారు.
Five wicket haul by Shaheen Afridi at the Chinnaswamy Stadium. pic.twitter.com/GAgtOD8WoQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023
259/0 to 367/9.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023
A great comeback by Pakistan bowlers in the back end with a five wicket haul by Shaheen Afridi. pic.twitter.com/J6SOpBFKjQ