బెంగళూరు, చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ ప్రేక్షకుడు పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలతో హోరెత్తించాడు. సదరు ప్రేక్షకుడు పాక్ అభిమానిగా తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడు పాకిస్తాన్ జిందాబాద్ అని అరవగా.. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి అతన్ని అడ్డుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఉన్న వివరాలను బట్టి తనకు తాను పాకిస్తాన్‌కు చెందినవాడినని చెప్పుకున్న ప్రేక్షకుడు.. పోలీసుతో వాదిస్తున్నాడు. భారత్ మాతాకీ జై అన్న నినాదాలు చేయొచ్చు కానీ, పాకిస్తాన్ జిందాబాద్ అని ఎందుకు అనకూడదో చెప్పాలని ప్రశ్నిస్తున్నాడు. అందుకు పోలీస్ అధికారి బదులిస్తూ.. భారత్ మాతా కీ జై మంచిదదే కానీ పాకిస్తాన్ జిందాబాద్ మంచిది కాదని చెప్తున్నారు.
One Bengaluru Policeman stopped a Pak supporter from saying "Pakistan Zindabad"
— Squint Neon (@TheSquind) October 20, 2023
Pak supporter said that "People next to him are shouting Bharat Mata ki Jai, why he can't say Pakistan Zindabad"
Policemen responded "Bharat mata ki jai is fine, not Pakistan zindabad"
Based? pic.twitter.com/2xWbEgRQaW
ధీటుగా బదులిస్తోన్న పాక్
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 367 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పాక్ ధీటుగా బదులిస్తోంది. 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 131 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్(62), అబ్దుల్లా షఫీక్(62) క్రీజులో ఉన్నారు.
5️⃣0️⃣ ?
— Pakistan Cricket (@TheRealPCB) October 20, 2023
Solid innings from @imabd28 as he brings up his second ODI half-century ?#AUSvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/aEuj9IvAsh
Both openers with fifties ?
— Pakistan Cricket (@TheRealPCB) October 20, 2023
20th ODI half-century by @ImamUlHaq12 ?#AUSvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/G1ETEXajN3