Cricket World Cup 2023: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్..ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ ఇదే

Cricket World Cup 2023: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్..ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ ఇదే

వరల్డ్ కప్ లో భాగంగా నేడు రెండో సెమీస్ జరగనుంది. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో తలపడతుంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ రెండు జట్లు ఈ సెమీస్ ఫైట్ లో గెలిస్తే నవంబర్ 19 న భారత్ తో ఫైనల్ ఆడాల్సి ఉంది. భారత్ తో ఏ జట్టు ఫైనల్ ఆడుతుంది అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉండడంతో ఈ మ్యాచ్ చూడడానికి కోల్ కత్తా కు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు   ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమతుల్యంగా ఉంటుంది. పూర్తిగా బ్యాటింగ్ కు కానీ అదే విధంగా పూర్తి స్థాయి బౌలింగ్ కు ఈ పిచ్ అనుకూలించదు. ఇన్నింగ్స్  ప్రారంభ సమయంలో పేసర్లకు ఈ పిచ్ సహకరిస్తుంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మైదానంలో ఛేజింగ్ అంత ఈజీ కాదు. ఈ పిచ్ పై వరల్డ్ కప్ లో చివరి రెండు మ్యాచ్ లు చూసుకుంటే ఛేజింగ్ చేసిన జట్లు ఓడిపోయాయి. నవంబర్ 5న భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ లీగ్ మ్యాచ్ జరిగితే.. 243 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది.

మొత్తం ఇక్కడ 39 మ్యాచ్ లు జరిగాయి. మొదటిసారి బ్యాటింగ్ చేసిన జట్టు 23 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే ఛేజింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్ ల్లో నెగ్గింది. ఈ పిచ్ పై యావరేజ్ స్కోర్ 244. ఈ వరల్డ్ కప్ ఈ మైదానంలో ఇంగ్లాండ్, పాకిస్థాన్ తలపడితే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.