కోల్‌కతా వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా రెండో సెమీఫైనల్ పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఆట ప్రారంభమైన గంట సేపటికే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం కారణంగా ఈరోజు ఆట కొనసాగించడం సాధ్యం కాకపోతే,, రిజర్వు డే(నవంబర్ 17) రోజు కొనసాగిస్తారు.
also read :- AUS vs RSA: సఫారీలను బెంబేలిస్తున్న స్టార్క్, హేజిల్ వుడ్.. 24 పరుగులకే 4 వికెట్లు
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. టెంబా బవుమా(0), క్వింటన్ డికాక్(3), డసెన్ (6), మార్‌క్రమ్ (10) పరుగులు చేశారు. తిరిగి ఆట ప్రారంభం అవ్వకూడదని సఫారీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు వారు వరుణుడి మొరపెట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
It's raining in Eden....!!!!
— Johns. (@CricCrazyJohns) November 16, 2023
- If it's a wash out today & tomorrow then South Africa will qualify into final. pic.twitter.com/Hel2BBTTj4