AUS vs SL: కంగారూలతో సమరం.. లంక జట్టు ప్రకటన

AUS vs SL: కంగారూలతో సమరం.. లంక జట్టు ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 12) తొలి వన్డే, శుక్రవారం(ఫిబ్రవరి 12) రెండో వన్డే జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు లంక క్రికెట్ బోర్డు(SLC) తమ జట్టును ప్రకటించింది. చరిత అసలంక నాయకత్వంలో 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.

పేరు గొప్ప.. ఊరు దిబ్బ..!

లంక జట్టును చూస్తే.. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న సామెత గుర్తొస్తోంది. చెప్పకోవడానికి జట్టులో ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. గెలిపించే మొనగాడు ఒక్కరూ కనిపించట్లేదు. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు టెస్ట్ జట్టే. పతుమ్ నిస్సాంకా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, కమిండు మెండిస్ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా.. బౌలింగ్‌లో స్పిన్నర్లు వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగేపైనే ఆశలన్నీ. వీరు ఏ మేరకు కట్టడి చేస్తారనే దానిపైనే లంక విజయావకాశాలు. పేసర్లు లహిరు కుమార, అసిత ఫెర్నాండో జట్టులో ఉన్నారనే పేరు తప్ప.. వీరి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. 

ALSO READ | BPL 2025: పార్టీకి ఎగ్గొడతావా, నీ వల్ల పరువు పోయింది: బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో మరో లొల్లి

ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, నువైనదు ఫెర్నాండో, కుసాల్ మెండిస్, జనిత్ లియనాగే, దునిత్ వెల్లలాగే, కమిందు మెండిస్, వనిందు హసరంగా, మహ్మద్ షిరాజ్, ఇషాన్ మలింగ, మహీష తీక్షణ, జెఫ్రీ వాండర్సే, నిషాన్ మధుష్క, అసిత ఫెర్నాండో, లహిరు కుమార.