AUS vs WI: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. విజయం దిశగా వెస్టిండీస్

AUS vs WI: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. విజయం దిశగా వెస్టిండీస్

గబ్బా వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఉత్కంఠను తలపిస్తోంది. విజయానికి ఆసీస్ 40 పరుగుల దూరంలో ఉండగా.. విండీస్ జట్టు 2 వికెట్ల దూరంలో ఉంది. ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శనతో తరుచు వార్తల్లో నిలుస్తున్న విండీస్ ఆటగాళ్లు.. ఈ మ్యాచ్‌లో అసాధారణ రీతిలో పోరాడుతున్నారు. సొంతగడ్డపై కంగారూలకు చెమటలు పట్టిస్తున్నారు. 

60-2 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ను విండీస్ బౌలర్ షమార్ జోసెఫ్(6 వికెట్లు) బెంబేలెత్తిస్తున్నాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ అలజడి రేపుతున్నాడు. మొదట వరుస బంతుల్లో క్రిస్ గ్రీన్(42), ట్రావిస్ హెడ్(0)లను ఔట్ చేసిన షమార్.. ఆపై కొద్దిసేపటికే మిచెల్ మార్ష్(10)ను పెవిలియన్ చేర్చి ఆసీస్ డగౌట్‌లో కలకలం రేపాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్.. 176-8. స్టీవ్ స్మిత్(72), నాథన్ లయన్(1) క్రీజులో ఉన్నారు. వీలైనంత త్వరగా స్మిత్‌ను పెవిలియన్ పంపాలి. లేదంటే మ్యాచ్ చేజారే అవకాశముంది. ప్రస్తుతానికి విండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్ 6 వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ చెరో వికెట్ తీసుకున్నారు.  

అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకై ఆలౌట్ అయ్యింది. తద్వారా 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.