AUS vs WI: గబ్బా కోటకు బీటలు.. 27 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం

AUS vs WI: గబ్బా కోటకు బీటలు.. 27 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం

ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ జట్టు సంచలన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్.. 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 216 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 207 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది.

బెంబేలెత్తించిన షమార్ జోసెఫ్

60-2 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ను విండీస్ బౌలర్ షమార్ జోసెఫ్(6 వికెట్లు) బెంబేలెత్తించాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆసీస్ డగౌట్‌లో లజడి రేపాడు. మొదట వరుస బంతుల్లో క్రిస్ గ్రీన్(42), ట్రావిస్ హెడ్(0)లను ఔట్ చేసిన షమార్.. ఆపై కొద్దిసేపటికే మిచెల్ మార్ష్(10), అలెక్స్ క్యారీ(2)లను పెవిలియన్ చేర్చి కంగారులను కష్టాల్లోకి నెట్టాడు. ఆ సమయంలో స్టీవ్ స్మిత్(91), మిచెల్ స్టార్క్(21) జోడి కాసేపు అడ్డుపడ్డారు. ఆపై మరోసారి బాల్ చేతి కందుకున్న షమార్.. స్టార్క్ ను ఔట్ చేసిన ఆస్ట్రేలియా పాఠాన్ని మరింత చేరువ చేశాడు.  చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విండీస్.. 8 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.

అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకై ఆలౌట్ అయ్యింది. తద్వారా 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఆసీస్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ విజయంతో వెస్టిండీస్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.

సంక్షిప్త స్కోర్లు:

  • వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్: 311
  • ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 289-9(డిక్లేర్)
  • వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 20