AUS vs WI: మ్యాక్స్‌వెల్ స్థానంలో యువ హిట్టర్.. వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

AUS vs WI:  మ్యాక్స్‌వెల్ స్థానంలో యువ హిట్టర్.. వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ఫిబ్రవరి 2 నుంచి వెస్టిండీస్‍తో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్  మ్యాక్స్‌వెల్ కు విశ్రాంతినిచ్చిన ఆసీస్ బోర్డు.. అతని స్థానంలో యువ విధ్వంసకర హిట్టర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌కు అవకాశమిచ్చింది.  

ఈ సిరీస్ ద్వారా మెల్‌బోర్న్ రెనెగేడ్స్ స్టార్ ఫ్రేజర్-మెక్‌గర్క్, బ్రిస్బేన్ హీట్ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ ఆసీస్ తరుపున వన్డేల్లో అరంగ్రేటం చేయనున్నారు. బార్ట్‌లెట్ 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మెయిడిన్ కాల్ అందుకున్న మెక్‌గర్క్ ఈ టోర్నీలో 158.64 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. అలాగే, యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరపున 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు.    

వెస్టిండీస్‌ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ షెడ్యూల్ 

  • మొదటి వన్డే (ఫిబ్రవరి 2): మెల్‌బోర్న్‌
  • రెండో వన్డే (ఫిబ్రవరి 4): సిడ్నీ ​​మరియు 
  • మూడో వన్డే (ఫిబ్రవరి 6): కాన్‌బెర్రా 

ఆస్ట్రేలియా వన్డే జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్నస్ లాబుస్‌చాగ్నే, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జాంపా.

వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, అలిక్ అథానాజ్, టెడ్డీ బిషప్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, గుడాకేష్ మోటీ, క్జోర్న్ ఓట్లీ, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్.