వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లైర్ తన అరంగేట్ర టెస్టులోనే ఔరా అనిపిస్తున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ మెప్పిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.
మొదట బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ(50) సాధించి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన సింక్లైర్, ఆ తరువాత ఫీల్డింగ్‌లోనూ మెప్పించాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఓ సంచలన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. అనంతరం బౌలింగ్‌లో వికెట్ తీసి.. తన డెబ్యూ టెస్టును ఓ తీపి జ్ఞాపకంగా మలుచుకున్నారు. అయితే, వికెట్ తీసిన ఆనందంలో సింక్లైర్ మైదానంలో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేశాడు. కీలక సమయంలో ఉస్మాన్ ఖవాజా(75) వికెట్ తీసిన అతను గాల్లోకి ఎగురుతూ పల్టీలు కొడుతూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Maiden Test wicket celebrations don't get better than this from Kevin Sinclair ??♂️ #AUSvWI pic.twitter.com/WRfw65mT1T
— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 289/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టుకు 22 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 22 పరుగులు వెనకబడి ఉన్నప్పటికీ.. కంగారూలు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడమనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బలమైన జట్టుతో మ్యాచ్ అయ్యుంటే ఇలానే ముందుగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేవారా..! అని నెటిజెన్స్ చర్చిస్తున్నారు.
Cartwheel celebration by Kevin Sinclair after taking his first Test wicket. ??#TestCricket #AUSvsWI #Australia #AUSvWI #WIvAUS
— Secular Chad (@SachabhartiyaRW) January 26, 2024
pic.twitter.com/h02sLtHRrO