పంచాంగ శ్రవణం వలన కలిగే శుభఫలితాలు

పంచాంగ శ్రవణం వలన కలిగే శుభఫలితాలు

ఉగాది రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అనే ఐదు అంగాలను వివిరించేదే పంచాంగం. పంచాంగశ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. పంచాంగకర్త నవనాయకులు, ఉపనాయకులు, వారికి ఆధిపత్యం వహించే గ్రహాలూ, వాటిద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు, వివిధ నక్షత్రాలు, రాశులవారి రాశిఫలాలు, ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, సవివరంగా తెలియజేస్తారు. దీనివల్ల ప్రతిమానవుడు ఆదాయాన్ని మించి వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలపాలు పడకుండా జాగ్రత్తపడతాడు. అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకుని, వాటికి తగిన విధంగా జీవనగమనాన్ని మార్చుకుంటూ, అభివృద్ధిని సాధిస్తాడు.

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్థనమ్
నక్షత్రార్థరతే పాపం యోగాద్రోహ నివారణమ్ ।

కరణాత్కార్యసిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్
కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రం లభేత్ ।।