బౌండరీ దగ్గర కళ్ళు చెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ క్యాచ్

బౌండరీ దగ్గర కళ్ళు చెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ క్యాచ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ 20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి వన్డేల్లో నమోదయింది. 

అబాట్ వాట్ ఏ క్యాచ్

ప్రస్తుతం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న జరిగిన  మూడో వన్డేల్లో ఆతిధ్య సౌత్ ఆఫ్రికా జట్టు 111 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక ఈ  వన్డేల్లో ఒక గ్రేట్ క్యాచ్ నమోదయింది. నాథన్ ఎల్లిస్ వేసిన 47వ ఓవర్ లో మార్కో జాన్సన్ వరుసగా 6,4,4 తో మాది ఊపు మీద ఉన్నాడు.అయితే ఈ ఓవర్ లో ఎల్లిస్ వేసిన నాలుగో బంతిని కూడా బలంగా బాదిన  జాన్సన్..మరో సిక్సర్ అనుకున్నాడు. కానీ ఇంతలో మెరుపులా దూసుకు వస్తూ  సీన్ అబ్బాట్ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఓ వైపు డైవ్ చేస్తూ తనను తాను బ్యాలన్స్ చేసుకుంటూ పట్టిన క్యాచ్ నభూతో న భవిష్యత్తు అనే రీతిలో ఉంది. 

Also read :- బంపరాఫర్ : ఆసియా గేమ్స్ కు సెలక్ట్ అవ్వండి.. రూ.10 లక్షలు పట్టుకెళ్లండి

ఈ క్యాచ్ చూసిన జాన్సన్ నమ్మలేక కాసేపు అలా చూస్తుండిపోయాడు. అబ్బాట్ పట్టిన ఈ క్యాచ్ కు స్టేడియం మెుత్తం షాక్ కు గురవ్వగా సోషల్ మీడియాలో ఈ క్యాచ్ వైరల్ గా మారింది. కొంతమంది నెటిజన్లు అయితే ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్ అంటూ కితాబులిస్తున్నారు. మరి వైరల్ అవుతున్న ఈ  క్యాచ్ మీరు చూసేయండి.