మెల్‌బోర్న్ : ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బోణీ చేసింది. బౌలింగ్‌లో జేవియర్ బార్ట్‌లెట్ (4/17), బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్ (79 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (77 నాటౌట్), ఇంగ్లిస్ (65) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.
తొలుత విండీస్ 48.4 ఓవర్లలో 231 రన్స్‌కు ఆలౌటైంది. కార్టీ (88), రోస్టన్ ఛేజ్ (59) ఫిఫ్టీలు కొట్టారు. అబాట్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్ 38.3 ఓవర్లలో 232/2 స్కోరు చేసి నెగ్గింది. బార్ట్‌లెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీలో జరుగుతుంది.