IND vs AUS 3rd Test: చెలరేగిన బుమ్రా.. తొలి సెషన్ టీమిండియాదే

IND vs AUS 3rd Test: చెలరేగిన బుమ్రా.. తొలి సెషన్ టీమిండియాదే

గబ్బా టెస్టులో భారత్ కు గొప్ప ఆరంభం దక్కింది. తొలి రోజు వర్షం కారణంగా 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు తొలి సెషన్ పూర్తిగా సాగింది. రెండో రోజు అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభం కాగా.. తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం చూపించింది. మూడు కీలక వికెట్లు తీసుకొని ముందంజలో ఉంది. రెండో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజ్ లో స్మిత్ (25), హెడ్ (20) ఉన్నారు. 

బుమ్రా మ్యాజిక్ 

వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులతో రెండో ఇన్నింగ్స్  ప్రారంభించిన ఆస్ట్రేలియాకు బుమ్రా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ తొలి బంతికి అద్భుతమైన బంతితో ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికీ నాథన్ మెక్‌స్వీనీ (9)ని బుమ్రా బోల్తా కొట్టించాడు. ఈ దశలో ఆస్ట్రేలియాను స్మిత్, లబుషేన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 37 పరుగుల స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు.

Also Read : సంతోష్ ట్రోఫీ ఫైనల్ రౌండ్‌ షురూ

ఈ దశలో సిరాజ్ మైండ్ గేమ్ ఫలిచింది. నితీష్ కుమార్ వేసిన తర్వాత ఓవర్లో లబుషేన్ ఔటయ్యాడు. 34 ఓవర్ రెండో బంతికి ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడబోయి స్లిప్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో ఆసీస్ 75 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత హెడ్, స్మిత్ లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా సెషన్ ను ముగించారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు.. నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది.