ENG v AUS 2024: వరుసగా 14 విజయాలు.. కొనసాగుతున్న ఆసీస్ జైత్రయాత్ర

ENG v AUS 2024: వరుసగా 14 విజయాలు.. కొనసాగుతున్న ఆసీస్ జైత్రయాత్ర

వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వరుసగా 14 విజయాలతో దూసుకెళ్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో వరుసగా 9 విజయాలు సాధించిన కంగారూల జట్టు.. ఆ తర్వాత వెస్టిండీస్ పై మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఇంగ్లాండ్ పై జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లను గెలిచింది. శనివారం లీడ్స్‌ వేదికగా హెడింగ్లీలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధించడంతో వన్డేల్లో వరుసగా 14 విజయాలను సాధించింది. 

వన్డేల్లో వరుసగా 21 విజయాలతో ఆసీస్ అగ్ర స్థానంలో కొనసాగుతుంది. 2003 లో ఆసీస్ ఈ ఘతన అందుకుంది. మరో 8 విజయాలు వరుసగా సాధిస్తే తమ రికార్డ్ ను తామే బ్రేక్ చేసుకుంటారు. ఓవరాల్ గా  క్రికెట్ లో ఆసీస్ మహిళా క్రికెట్ జట్టు వన్డేల్లో వరుసగా 26 విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. 2018- 2021 మధ్యలో వారు ఈ రికార్డ్ తమ పేరిట లిఖించుకున్నారు. ఇక 5 వన్డేల సిరీస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.

శనివారం (సెప్టెంబర్ 21) జరిగిన రెండో వన్డే విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూల జట్టు 44.4 ఓవర్లలో 8 వికెట్లకు 270 పరుగులకు ఆలౌటైంది. ఆలిస్ క్యారీ 67 బంతుల్లో 74 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. 5 వన్డేల సిరీస్ లో భాగంగా మూడో వన్డే సెప్టెంబర్ 24 న జరుగుతుంది.