ఇండోర్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 317 పరుగుల లక్ష్యాన్ని (33 ఓవర్లకు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఆసీస్ పది వికెట్లు కోల్పోయి 217 పరుగులు మాత్రమే చేసింది.
ఆసీస్ బ్యాటర్లో డేవిడ్ వార్నర్(53), సియాన్ అబాట్(54) మాత్రమే రాణించారు. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
శుభ్మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే సెప్టెంబర్ 27 న రాజ్కోట్ వేదికగా జరగనుంది.