IPL 2025 playoffs: ఐపీఎల్ 2025.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం..?

ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి మే 25 వరకు జరగనుంది. రెండు నెలలకు పైగా జరిగే ఈ టోర్నీలో ప్లే ఆఫ్ మ్యాచ్ లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం కానున్నారని సమాచారం. దీనికి కారణం లేకపోలేదు.  ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్నాయి.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఇప్పటికే ఖరారైంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. ఈ  ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3 న ప్రకటించింది. 

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ప్రిపేర్ కావలి కాబట్టి ప్లే ఆఫ్ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. టెస్ట్ జట్టులో ఉన్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ , మిచెల్ స్టార్క్ , జోష్ హేజిల్‌వుడ్,  ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. కమిన్స్, హెడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నారు. స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ కు హేజిల్‌వుడ్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడనున్నారు. వీరు లేకపోతే ఆయా జట్లపై తీవ్ర ప్రభావం చూపడం గ్యారంటీ. 

ALSO READ | Jasprit Bumrah: బుమ్రాకు బెడ్ రెస్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు డౌట్

మరోవైపు సౌతాఫ్రికా టెస్ట్ జట్టులో ఉన్న ఐడెన్ మార్క్‌రామ్, కగిసో రబడా, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్‌లు ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు దూరం కానున్నారని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ వీరు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి.

2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి.