AUS vs IND: ఇండియాతో సెమీస్‌.. కొత్త ఆల్ రౌండర్‌ను రంగంలోకి దించిన ఆస్ట్రేలియా

AUS vs IND: ఇండియాతో సెమీస్‌.. కొత్త ఆల్ రౌండర్‌ను రంగంలోకి దించిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో కొత్త ఆల్ రౌండర్ వచ్చి చేరాడు. ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీని ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ తో గ్రూప్ బి లో శుక్రవారం (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. అతని స్థానంలో యువ ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీకి చోటు దక్కింది. షార్ట్ లాగే కొన్నోలీ స్పిన్ ఆల్ రౌండర్. ఇటీవలే జరిగిన బిగ్ బాష్ లీగ్ లో అద్భుతంగా రాణించి జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు మూడు వన్డేల్లో కొన్నోలీ 10 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. 

కీలకమైన సెమీస్ పోరుకు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే షార్ట్ స్థానంలో అతనికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఛాంఫియన్స్ ట్రోఫీలో అంచనాలకు మించి రాణిస్తున్న మాథ్యూ షార్ట్ కీలకమైన సెమీస్ పోరుకు దూరం కావడం ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బె. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా క్రీజ్‎లో చురుగ్గా కదలేకపోయిన ఈ ఓపెనర్.. 15 బంతుల్లో 20 పరుగులు చేసి అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‏లో ఔట్ అయ్యాడు. అంతకముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ మంగళవారం (మార్చి 4) ఈ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఆస్ట్రేలియాతో తలపడిన భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ రికార్డ్ టీమిండియాకు ఊరట కలిగిస్తుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్స్క్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 

ఆస్ట్రేలియా జట్టు:

స్టీవ్ స్మిత్ (సి), సీన్ అబాట్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, ఆడమ్ జంపా.