వరల్డ్ కప్ టీమ్ను ప్రకటించిన ఆసీస్..స్టార్ ఆటగాడికి నో ఛాన్స్

వరల్డ్ కప్ టీమ్ను ప్రకటించిన ఆసీస్..స్టార్ ఆటగాడికి నో ఛాన్స్

వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రిలిమనరీ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టీమ్ కు ప్యాట్‌ కమ్మిన్స్‌ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ జట్టే వరల్డ్ కప్ కు ముందు సౌతాఫ్రికా, టీమిండియాలతో వన్డే సిరీస్ లు ఆడనుంది. 

స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్..

వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో స్టార్  ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌కు చోటు దక్కలేదు. అయితే ఈ టీమ్ లో మాత్రం యువ ఆల్‌రౌండర్‌ ఆరోన్ హార్డీ, స్పిన్నర్‌ తన్వీర్‌ సంగాలకు స్థానం దక్కింది.  వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లు తమ 15 మంది ఆటగాళ్ల వివరాలను సెప్టెంబర్‌5 లోపు ఐసీసీకి తెలిపాలి.  ఈ నేపథ్యంలో ఆసీస్‌ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ టీమ్ ను ఎంపిక చేసింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు తుది 15 మంది ఆటగాళ్ల పేర్లను  ఖారారు చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లో  ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న టీమిండియాతో తలపడనుంది.

 వన్డే ప్రపంచకప్‌కు ముందు  ఆసీస్ మొత్తం 8 వన్డేలు ఆడనుంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో పాల్గొననుంది. ఆ తర్వాత టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది.  సెప్టెంబర్‌ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్‌-ఆసీస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.  

ఆస్ట్రేలియా  వరల్డ్‌కప్‌ జట్టు :  పాట్ కమిన్స్ (కెప్టెన్‌), వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్,  మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్,  ,ఆడమ్ జంపా,   తన్వీర్ సంఘా,