పుణె : వరల్డ్‌కప్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (132 బాల్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 177 నాటౌట్) భారీ సెంచరీతో చెలరేగడంతో.. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 306/8 స్కోరు చేసింది. తౌహిద్ హ్రిదయ్ (74), నజ్ముల్ హుస్సేన్ (45), తన్జిద్ హసన్ (36), లిటన్ దాస్ (36), మహ్మదుల్లా (32) రాణించారు. సీన్ అబాట్, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లు తీశారు.
తర్వాత ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలో 307/2 స్కోరు చేసి గెలిచింది. మూడో ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ (10) ఔటైనా, డేవిడ్ వార్నర్ (53), మిచెల్ మార్ష్ రెండో వికెట్‌కు 120 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. స్టీవ్ స్మిత్ (63 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్ష్‌తో పోటీపడి ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. మూడో వికెట్‌కు 135 బాల్స్‌లోనే 175 రన్స్ జత చేసి ఈజీగా గెలిపించారు. మిచెల్ మార్ష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.