
బ్రిడ్జ్‌టౌన్ : బ్యాటింగ్‌లో రాణించిన ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్ కప్‌లో రెండో రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్ (39), ట్రావిస్ హెడ్ (34), మిచెల్ మార్ష్ (35), మార్కస్ స్టోయినిస్ (30) సమయోచితంగా రాణించడంతో శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 36 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 201/7 స్కోరు చేసింది.
వార్నర్, హెడ్ తొలి వికెట్‌కు 70 రన్స్ జోడించగా, మార్ష్, మ్యాక్స్‌వెల్ (28) థర్డ్ వికెట్‌కు 65 రన్స్ జత చేశారు. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 165/6 స్కోరుకే పరిమితమైంది. బట్లర్ (42), ఫిల్ సాల్ట్ (37) రాణించారు. మిడిలార్డర్‌లో విల్ జాక్స్ (10), బెయిర్‌స్టో (7) ఫెయిలైనా, మొయిన్ అలీ (25), హ్యారీ బ్రూక్ (20 నాటౌట్), లివింగ్‌స్టోన్ (15) పోరాడినా ఫలితం లేకపోయింది.