క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టుపై 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయిన ఆసీస్ 356 పరుగులు చేసింది. ఓపెనర్లు వైస్ కెప్టెన్ అలీసా హీలీ 138 బంతుల్లో 170 పరుగులు, రాచెల్ హేన్స్ 93 బంతుల్లో 68 పరుగులు చేసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మరో ప్లేయర్ బెత్ మూనీ 47 బంతుల్లో 62 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ అన్య ష్రబ్ సోల్ 3 వికెట్లు తీసి 46 పరుగులిచ్చింది.
తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి ఇంగ్లండ్.. 43.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నటాలీ స్కైవర్ 121 బంతుల్లో 148 పరుగులు నాట్ అవుట్ గా నిలిచింది. కానీ, నటాలీకి మిగతా ప్లేయర్ల నుంచి సరైన భాగస్వామ్యం లభించలేదు. దాంతో టైటిల్ నెగ్గాలన్న కల తీరాకుండానే మిగిలింది. కాగా.. ఇప్పటికే ఆరుసార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా.. ఏడోసారి కూడా టైటిల్ దక్కించుకుంది. ఆసీస్ బౌలర్లు అలాన కింగ్, జెస్ జోనాసన్ చెరో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు.
For More News..
పబ్‌లో ప్రముఖులు.. లైవ్ అప్డేట్స్
పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్