
క్రైస్ట్‌చర్చ్: అలెక్స్ క్యారీ (98 నాటౌట్), మిచెల్ మార్ష్ (80) సూపర్ పెర్ఫామెన్స్‌తో న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. నాలుగు రోజు, సోమవారం ముగిసిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. కివీస్ ఇచ్చిన 279 రన్స్ టార్గెట్‌ను 7 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసిన ఆసీస్ సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 77/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (18) వికెట్ కోల్పోయింది. కానీ, క్యారీ, మార్ష్ ఆరో వికెట్‌కు 140 రన్స్ జోడించి ఆదుకున్నారు. మార్ష్, స్టార్క్ (0) వెంటవెంటనే ఔటైనా కెప్టెన్ కమిన్స్ (32 నాటౌట్)తో కలిసి క్యారీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.