అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటింగ్ విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ కు ఏదీ కలిసి రాలేదు. రెండో వికెట్ కు రాహుల్, గిల్ జోడించిన 69 పరుగుల భాగస్వామ్యం తప్ప ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకే ఆలౌట్ అయింది.
42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 4 వికెట్ల నష్టానికి 82 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ(3) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్ (21)పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో అశ్విన్ 22 పరుగులు చేసి భారత్ స్కోర్ కార్డ్ ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే స్టార్క్ మరోసారి భారత్ కు షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్ లో అశ్విన్, హర్షిత్ రానా లను ఔట్ చేశాడు.
ALSO READ : NZ vs ENG: సేమ్ ఒకటే బాల్: రాహుల్‌కు న్యాయం.. విలియంసన్‌కు అన్యాయం
అయితే ఈ టైంలో హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ (42) రెడ్డి ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడుతూ భారత ఇన్నింగ్స్ కు చివర్లో విలువైన పరుగులు సమకూర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ కు ఆరు వికెట్లు తీసుకున్నాడు. బోలాండ్ 3 వికెట్లు.. కమ్మిన్స్ కు రెండు వికెట్లు లభించాయి. జైశ్వాల్ (0), కోహ్లీ (7), రోహిత్ శర్మ (3) విఫలమయ్యారు. రాహుల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. గిల్ 31 పరుగులతో రాణించాడు.
From 69-1, India fall short of 200 after opting to bat first 😮
— ESPNcricinfo (@ESPNcricinfo) December 6, 2024
🔗 https://t.co/wfMJTYdmOw | #AUSvIND pic.twitter.com/ZVClbZ0W6o