6 బాల్స్‌‌కు 6 వికెట్లు

6 బాల్స్‌‌కు 6 వికెట్లు

గోల్డ్‌‌కోస్ట్‌‌: ఆస్ట్రేలియాకు చెందిన క్లబ్ క్రికెటర్‌‌‌‌ గారెత్ మోర్గాన్ వన్డే మ్యాచ్‌‌లో ఆరు బాల్స్‌‌కు ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్3 పోటీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌‌లో ముద్గీరబా నెరంగ్ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ క్లబ్ కెప్టెన్ అయిన మోర్గాన్ ప్రత్యర్థి సర్ఫర్స్ పారడైస్ సీసీపై ఈ ఘనత సాధించాడు. నెరంగ్ ఇచ్చిన 178 రన్స్ ఛేజింగ్‌‌లో సర్ఫర్స్ టీమ్ 174/4తో గెలుపు ముంగిట నిలిచింది. 

కానీ, 40వ ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన గారెత్ మోర్గాన్ ఒక్క రన్‌‌ ఇవ్వకుండా ఆరు బాల్స్‌‌కు ఆరుగురిని పెవిలియన్ చేర్చి 174  స్కోరు వద్దే సర్ఫర్స్‌‌ను ఆలౌట్ చేశాడు.  ఇందులో తొలి నాలుగు వికెట్లు క్యాచ్‌‌ ఔట్స్‌‌ కాగా.. తర్వాతి ఇద్దరిని బౌల్డ్‌‌ చేశాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌‌లో ఇప్పటిదాకా ఒక ఓవర్లో ఐదు వికెట్లు తీయడమే అత్యధికం. కర్నాటకకు చెందిన అభిమన్యు మిథున్‌‌ 2019లో హర్యానాపై ఈ ఘనత సాధించాడు. అంతకుముందు కివీస్ క్రికెటర్ నీల్ వాగ్నర్ (2011), బంగ్లా ఆటగాడు అల్ అమిన్​ హొస్సేన్ (2013)ఐదేసి వికెట్లు పడగొట్టారు.