అఫీషియల్ అప్డేట్: నితిన్ రాబిన్హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్.. వెల్కమ్ అంటున్న ఫ్యాన్స్..

అఫీషియల్ అప్డేట్: నితిన్ రాబిన్హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్.. వెల్కమ్ అంటున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "రాబిన్హుడ్".   ఈ సినిమాలో నితిన్ కి జోడీగా యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ని  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవంబర్ 14న ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పటికే రాబిన్హుడ్ రిలీజ్ కావాల్సి ఉండగా పలు అనివార్య కారణాలవల్ల రిలీజ్ కాలేదు.. దీంతో మేకర్స్ రీసెంట్ గా మార్చ్ 28న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.. కానీ చిత్ర యూనిట్ మాత్రం చప్పుడు సి చెయ్యలేదు. అయితే శనివారం మేకర్స్ రాబిన్హుడ్ లో డేవిడ్ వార్నర్ కామియో రోల్ గురించి స్పందించారు. ఇందులోభాగంగా డేవిడ్ వార్నర్ పోస్టర్ ని షేర్ చేస్తూ అధికారికంగా తెలిపారు. గ్రౌండ్ లో బౌండరీలు బాదిన ఈ క్రికెటర్ ఇపుడు సిల్వర్ స్క్రీన్ పై మెరవాల్సిన సమయం వచ్చిందంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.. ఫోర్లు, సిక్సర్లతో అలరించిన ఈ స్టార్ క్రికెటర్ వెండితెరపై ఎలా ఆకట్టుకుంటాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డేవిడ్ వార్నర్ ఎక్కువగా సన్ రైజర్స్ ఐపీయల్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2016లో కెప్టెన్ గా వ్యవహరించి కప్ కూడా అందించాడు. దీంతో తెలుగు రాష్ట్రాలనుంచి డేవిడ్ వార్నర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అంతేకాదు డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో తెలుగు సాంగ్స్ కి స్టెప్పులేస్తూ అలరించాడు. దీంతో డేవిడ్ వార్నర్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ లో ఎక్కువ శాతం మంది మన భారతీయులే ఉన్నారు..