ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ కు షాక్.. వీసా ఫీజు అమాంతం పెంచేసింది ఆ దేశం. ఇప్పటి వరకు 710 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు ఆ ఫీజును వెయ్యి 1600 డాలర్లకు పెంచింది ఆస్ట్రేలియా. ఒకేసారి వెయ్యి 890 డాలర్లు పెంచటం అందర్నీ షాక్ కు గురి చేసింది. భారత కరెన్సీలో 39 వేల 500 నుంచి ఏకంగా రూ. 89 వేలకు పెంచిందన్న మాట
అంతేగాకుండా విజిట్ వీసాదారులతో పాటు గ్రాడ్యుయేట్ వీసాలున్న విద్యార్థులు స్టూడెంట్ వీసా కోసం ఆన్‌షోర్‌లో దరఖాస్తు చేయకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయం వల్ల పరిమితంగా.. తమ దేశానికి వలసలు మరింత మెరుగ్గా వీసాలుంటాయని హోం వ్యవహారాల మంత్రి క్లేర్ ఓనీల్ తెలిపారు.
అలాగే విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో వీసా గడువును నిరంతరం పొడిగించుకునే నిబంధనను నిలిపివేసింది.2023లో 1.50 లక్షల మందికి పైగా వీసా గడువును పొడిగించు కోవడతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:కొత్త చట్టాలపై వాయిదా తీర్మానాలను తిర్కస్కరించిన స్పీకర్
2023 సెప్టెంబర్ 30 నాటికి 5,48,800 మంది ఇతర దేశాల విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నట్లు వెల్లడించింది ఆస్ట్రేలియా. ఇది 2022తో పోలిస్తే 60 పెరిగిందని వెల్లడించింది.2022లో కొవిడ్ నిబంధనలు ఎత్తేవేసిన తర్వాత స్టూడెంట్ వీసాలు పెరిగాయని తెలిపింది. ఈ ధరలతో ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా మరింత కాస్ట్ కానుంది. అమెరికాలో 185 డాలర్లు ఉంటే కెనెడాలో 150 డాలర్లుగా ఉంది.
ఆస్ట్రేలియా పెంచిన వీసా ఫీజులపై యూనివర్శిటీస్ ఆస్ట్రేలియా సీఈఓ ల్యూక్ షీహీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు,యూనివర్శిటీలకు ఇది మంచి నిర్ణయం కాదన్నారు. యూనివర్శిటీలన్నీ అంతర్జాతీయ విద్యార్థుల ఫీజులపై ఎక్కువగా ఆధారపడుతాయని తెలిపింది.
అంతర్జాతీయ విద్య అనేది ఆస్ట్రేలియా యొక్క అతిపెద్ద ఎగుమతి పరిశ్రమలలో ఒకటి అని చెప్పారు. 2022- -2023 ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియాకు 36.4 బిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ఆదాయం వచ్చిందన్నారు.