మెల్‌బోర్న్ : బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇండియాతో జరిగే నాలుగు, ఐదు టెస్టుల కోసం ఆస్ట్రేలియా తమ జట్టులో అనూహ్య మార్పు చేసింది. 19 ఏండ్ల యంగ్ బ్యాటర్ సామ్ కొన్‌స్టస్‌ను తొలిసారి టీమ్‌లోకి తీసుకున్నారు. ఒకవేళ బాక్సింగ్ డే టెస్ట్‌లో కొన్‌స్టస్ అరంగేట్రం చేస్తే 70 ఏళ్ల చరిత్రలో టీమ్‌లోకి వచ్చిన యంగెస్ట్ బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇయాన్ క్రెయిగ్ (17 ఏండ్ల 293 రోజులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలుస్తాడు. యంగెస్ట్ బౌలర్‌గా కమిన్స్ 18 ఏళ్ల 193 రోజుల్లో అరంగేట్రం చేశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఫెయిలైన నేథన్ మెక్‌స్వీని తప్పించారు.
దీంతో ఖవాజతో కలిసి కొన్‌స్టస్ ఓపెనర్‌గా బరిలోకి దిగొచ్చు. కాలి పిక్క గాయంతో టీమ్‌కు దూరమైన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ప్లేస్‌లో జో రిచర్డ్‌సన్‌ను తీసుకున్నారు. శుక్రవారం ప్రకటించిన జట్టులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్ (కెప్టెన్), అబాట్, బోలాండ్, అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఖవాజ, సామ్ కొన్‌స్టస్, లబుషేన్, నేథన్ లైయన్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్.