Cricket World Cup 2023: 400 కొట్టినా నో గ్యారంటీ.. నేడు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా బ్లాక్ బస్టర్ మ్యాచ్

క్రికెట్ లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచులకు ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ఈ  రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచు జరిగినా మ్యాచ్ హోరాహోరీగా జరగడంతో పాటు భారీ స్కోర్ కూడా నమోదవుతూ ఉంటుంది. 2005 లో ఈ రెండు జట్ల మధ్య జోహనెస్ బర్గ్ లో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా విధించిన 434 పరుగుల భారీ టార్గెట్ ని దక్షిణాఫ్రికా ఛేజ్ చేసింది.

తాజాగా వరల్డ్ కప్ కి ముందు జరిగిన సిరీస్ లో కూడా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. దీంతో ఈ రోజు వరల్డ్ కప్ లో జరగనున్న మ్యాచు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరగనున్న ఈ మ్యాచుకు ఇరు జట్లు బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వార్నర్, మ్యాక్స్ వెల్, మిట్చెల్ మార్ష్, స్మిత్ లాంటి బ్యాటర్లు ఆసీస్ జట్టులో ఉంటే.. మార్కరం, క్లాసన్, వాండెర్ డసెన్, మిల్లర్, డికాక్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు దక్షిణాఫ్రికా సొంతం.

Also Read :- చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్లు
 
ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచులో భారత్ పై ఓడిపోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా శ్రీలంకను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచులోకి అడుగుపెడుతుంది. రెండు జట్లలో పవర్ హిట్టర్లు ఉండడంతో మొదట బ్యాటింగ్ చేసి 400 కొట్టినా  ప్రత్యర్థి ఛేజ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఎవరు గెలిచినా ఈ మ్యాచు అభిమానులకి వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తుంది.