అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుపై ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 48.5 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటయ్యింది. ఆస్ట్రేలియా పేసర్ టామ్ స్ట్రాకర్ 6 వికెట్లతో చెలరేగాడు. పాక్ బ్యాటర్ లలో అజాన్ అవైస్ (52, అరాఫత్ మిన్హాస్ (52) అర్ధశతకాలు చేశారు. దీంతో పాక్ ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు
ఆ తరువాత లక్ష్యచేధనలో ఆసీస్ ను పాక్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 59 పరుగులకే నాలుగు కీలక వికెట్లను పడగొట్టి ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టారు. ఓ పక్క వికెట్లు పడిపోతున్నా.. ఓపెనర్ హ్యారీ డిక్సన్ (50) , ఓలివర్ పీక్ (49 ) క్రీజులో నిలదొక్కుకుంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో వచ్చిన రాఫ్ మ్యాక్ మిలన్ (19*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట చివరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా.. జీషన్(4*) బౌండరీ బాదడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. దీంతో ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుని భారత్ తో తలపడనుంది.
తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి ఫైనల్ కు చేరింది భారత్. గత ఏడాది జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది. మరి దీనిరి జూనియర్ ఆటగాళ్లు ప్రతికారం తీర్చుకుంటారో లేదో చూడాలి.