టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నమీబియాతో తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం ఉదయం (మే 29) 4:30 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టులో 11 మంది ఆటగళ్లలో 9 మంది ఆటగాళ్లే ఉండడంతో ఆ జట్టు ప్రధాన కోచ్ బెయిలీతో పాటు సెలక్టర్ మెక్‌డొనాల్డ్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ మైదానంలోకి అడుగు పెట్టవలసి వచ్చింది.
ఆసీస్ ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో ప్రస్తుతం 9 మంది మాత్రమే ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా.. 46 ఏళ్ల ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్, హెడ్ కోచ్ బెయిలీతో కలిసి ఫీల్డింగ్ చేయడానికి గ్రౌండ్ లోకి దిగారు. మార్ష్, హేజిల్‌వుడ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళినప్పుడు..సెలక్టర్ మెక్‌డొనాల్డ్, 49 ఏళ్ల బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆడిన ఆసీస్ ఆటగాళ్లు గ్రీన్, మ్యాక్స్ వెల్, లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడిన స్టోయినీస్ ఇప్పటివరకు విండీస్ చేరుకోలేదు. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ఆడిన హెడ్, స్టార్క్, కమ్మిన్స్ జట్టులో చేరాడని సమయం పడుతుంది. దీంతో 9 మందితోనే ఆసీస్ ఈ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
ALSO READ | T20 World Cup 2024: న్యూయార్క్ చేరుకున్న హార్దిక్.. జట్టులో చేరని కోహ్లీ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా నమీబియాపై 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా.. జోష్ హేజిల్‌వుడ్ (2/5), లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (3/25) ధాటికి 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో డేవిడ్ వార్నర్ (21 బంతుల్లో 54 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.