కొత్త ఏడాదికి ఆస్ట్రేలియా గ్రాండ్ వెల్కం చెప్పింది.సిడ్నీలో వేడుకలు అంబరాన్నంటాయి.. భారీగా వీధుల్లోకి వచ్చిన జనం వేడుకలు చేసుకుంటున్నారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు పౌరులు భారీగా చేరుకుంటున్నారు. విద్యుత్ దీపాల నడుమ, బాణాసంచా కాల్చుతూ, డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొడుతున్నారు జనం.
భారత్ కంటే ముందు న్యూజిలాండ్,ఆస్ట్రేలియా వేడుకలు చేసుకుంటున్నాయి... ఇండియా టైమ్ ప్రకారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జపాన్, ఉత్తర కొరియా వేడుకలు చేసుకోనున్నాయి. రాత్రి 9గంటల 30 నిమిషాలకు చైనా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్,ఫిలిప్సీన్స్ .. రాత్రి 10గంటల 30 నిమిషాలకు థాయిలాండ్, వియత్నాం, కాంబోడియాలో న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి.