Cricket World Cup 2023: బాబోయ్ ఈ ఎండను తట్టుకోలేం: చెన్నైలో సూరీడు దెబ్బకు కుదేలైన వార్నర్,స్మిత్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచులో ఎండ ఆసీస్ ఆటగాళ్ల పాలిట విలన్ గా మారింది. వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సూరీడు ధాటికి విలవిల్లాడారు. చెన్నైలో గత కొన్నిరోజులుగా వర్షం అంతరాయం ఉంటుందని అందరూ కంగారు పడితే ఎండ విజ్రంభించడంతో సీన్ రివర్స్ అయింది. 

ప్రస్తుతం చెన్నైలో ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఈ ఎండను తట్టుకోలేని స్మిత్, వార్నర్ విరామ సమయంలో నీడ కోసం గొడుగులకు తెప్పించుకున్నారు. భారత ఫీల్డర్లు కూడా ఎండ ధాటికి కూలింగ్ వాటర్, ఐస్ ప్యాక్,  టవల్స్ తెప్పించుకున్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఎండ తట్టుకొని బ్యాటింగ్ చేయడం సవాలుగా మారింది. భారత్ లోని  వాతావరణ పరిస్థితులను అలవాటు పడలేక ఇటీవలే  జరిగిన మూడో వన్డేలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

కాగా.. వరల్డ్ కప్ లో ఇరు జట్లు తమ తొలి మ్యాచుని ప్రారంభించగా.. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జడేజా వరుస విరామాల్లో మూడు వికెట్లతో కంగారులను కకావికలం చేసాడు. బుమ్రా, కుల్దీప్ యాదవ్ కి చెరో వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో  స్మిత్ 46, వార్నర్ 41 పరుగులతో రాణించారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)