పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై..తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై..తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

పెర్త్‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీని అందుకుంది. బ్యాటర్లు, బౌలర్లు సమయోచితంగా రాణించడంతో 360 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో పాక్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో కంగారూలు 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియా ఇచ్చిన 450 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేదించేందుకు నాలుగో రోజు, ఆదివారం బరిలోకి దిగిన పాక్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 30.2 ఓవర్లలో 89 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది.

సౌద్‌‌‌‌‌‌‌‌ షకీల్‌‌‌‌‌‌‌‌ (24) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో స్టార్క్‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. 2 వికెట్లు పడగొట్టిన నేథన్‌‌‌‌‌‌‌‌ లైయన్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో 500 మైలురాయిని అందుకున్నాడు. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు 84/2తో ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 63.2 ఓవర్లలో 233/5 వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖవాజ (90) సెంచరీ మిస్‌‌‌‌‌‌‌‌ చేసుకోగా, స్మిత్‌‌‌‌‌‌‌‌ (45), మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (63 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించారు.  మార్ష్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 26న
 మొదలవుతుంది.