
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. గాయపడిన షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలీ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంఘా తుది జట్టులోకి వచ్చాడు. వీరిద్దరూ స్పిన్నర్లే కావడం విశేషం. నిజానికి ఆసీస్ బలమంతా ఫాస్ట్ బౌలర్లే. ఆ జట్టు చరిత్ర ఒకసారి చూసుకుంటే ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం అరుదు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆసీస్ జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండడం విశేషం.
దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని ఇప్పటికే మ్యాచ్ కు ముందు స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఈ కారణంగానే స్మిత్ ఇద్దరు స్పిన్నర్లను తీసుకొని ఉండొచ్చు. సంఘా స్పెషలిస్ట్ స్పిన్నర్ కాగా.. కూపర్ కొన్నోలీ పార్ట్ టైం స్పిన్నర్. వీరిద్దరికీ పెద్దగా వన్డేలు ఆడిన అనుభవం లేకపోయినా ఏకంగా సెమీస్ ఆడేందుకు సిద్ధమయ్యారు. సంఘా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడాడు. మరోవైపు కొన్నోలీకి ఇది నాలుగో వన్డే. వీరితో పాటు ఆడం జంపా, మ్యాక్స్ వెల్ రూపంలో ఆసీస్ జట్టులో మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో మ్యాచ్ తర్వాత తెలుస్తుంది..
Also Read : టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్
ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా ఈ వ్యూహంతో విజయం సాధించిన ఆశ్చర్యం లేదు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి,జడేజా,కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలకంగా మారనున్నారు.
🚨2 changes for Australia 🚨
— Cricketism (@MidnightMusinng) March 4, 2025
⬆️ Cooper Connolly, Tanveer Sangha
⬇️ Matthew Short, Spencer Johnson#INDvsAUS #INDvAUS pic.twitter.com/GMaCczckzy