టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ లు మే 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు వార్మప్ మ్యాచ్ ముగిసాయి. ఈ మూడు మ్యాచ్ లు కూడా చిన్న జట్ల మధ్య జరిగాయి. రేపటి నుంచి అగ్రశ్రేణి జట్లు వార్మప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా రేపు ఆస్ట్రేలియా నమీబియాతో తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మే 29 ఉదయం 4:30 నిమిషాలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
వార్మప్ మ్యాచ్ కు ఆ జట్టులో 11 మంది ఆటగాళ్లు లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ జట్టు 15 మంది స్క్వాడ్ లో 9 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయం నుంచి కోలుకోవడానికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆడిన ఆసీస్ ఆటగాళ్లు గ్రీన్, మ్యాక్స్ వెల్, లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడిన స్టోయినీస్ ఇప్పటివరకు విండీస్ చేరుకోలేదు. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ఆడిన హెడ్, స్టార్క్, కమ్మిన్స్ జట్టులో చేరాడని సమయం పడుతుంది. దీంతో 8 లేదా 9 మందితోనే ఆసీస్ ఈ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ కు ఆసీస్ కోచింగ్ స్టాఫ్ ఫీల్డర్లుగా వార్మప్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ ముందు ఆటగాళ్లకు గాయాలు కాకుండా రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఆసీస్ యాజమాన్యం కనిపిస్తుంది. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రేపు (మే 29) నమీబియాతో, మే 31 న వెస్టిండీస్ తో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. జూన్ 6న ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఒమన్ తో ఆడుతుంది.
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు 2024:
మిచ్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Australia could have only 8 players available for their warm-up match against Namibia due to a few IPL players getting rest.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2024
- Australia may be forced to use support staff as substitute fielders. pic.twitter.com/KJOanzcxdR