
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు రెండు మార్పులు చేసింది. గాయపడిన షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలీ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంఘా వచ్చాడు.
తుది జట్లు
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా:
కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘతన్వీర్ సంఘా
Also Read:-ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్‌కు వెళ్లే జట్లేవో చెప్పిన ఏబీ డివిలియర్స్