World Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ శర్మ.. ఆసీస్ బౌలింగ్

World Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ శర్మ.. ఆసీస్ బౌలింగ్

వరల్డ్ కప్ తుది సమరానికి టాస్ పడింది. అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా ఈ మెగా పోరులో తలపడేందుకు సిద్ధమైపోయారు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు సెమీ ఫైనల్ ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి.

లీగ్ మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు విశ్వ విజేతగా నిలిచేందుకు ఆరాటపడుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్ళగా.. ఆసీస్ తొలి రెండు మ్యాచ్ ల్లో తడబడి ఓడిపోయినా ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్ ల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా జరగడం ఖాయమని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.  
 
ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఎంత ప్రమాదకర జట్టు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో, 2015 వరల్డ్ సెమీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో చిత్తయిన సంగతి తెలిసిందే. కానీ సొంతగడ్డపై ఆడుతుండడం భారత్ కు కలిసి రానుంది.               

తుది జట్లు 

ఇండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా:

డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.