మెల్‌బోర్న్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (50) రాణించడంతో... గురువారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 62.3 ఓవర్లలో 187/6 స్కోరు చేసింది.
అలెక్స్ క్యారీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆరంభంలో పాక్ బౌలర్లు షాహిన్ ఆఫ్రిది (3/58), హమ్జా (3/27) దెబ్బకు ఉస్మాన్ ఖవాజ (0), డేవిడ్ వార్నర్ (6), లబుషేన్ (4), ట్రావిస్ హెడ్ (0) ఫెయిలయ్యారు. దీంతో 16/4తో పీకల్లోతు కష్టాల్లో పడిన కంగారూలను స్మిత్, మార్ష్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 153 రన్స్ జోడించారు. ప్రస్తుతం ఆసీస్ 241 రన్స్ లీడ్‌లో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 194/6తో ఆట మొదలుపెట్టిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్లలో 264 రన్స్‌కు ఆలౌటైంది.