అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టుతో ఫైనల్ ఆడబోయే జట్టు ఏదో నేడు తేలనుంది. తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన టీమిండియా.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. నేడు (ఫిబ్రవరి 8) పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. బ్యాటింగ్ లో తేలిపోయారు. ఆసీస్ బౌలర్లు విజ్రంభించడంతో కేవలం 180 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది.
పాక్ జట్టులో అజాన్ అవైస్(52),అరాఫత్ మిన్హాస్(52) అర్ధ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ హుస్సేన్ 17 పరుగులు చేయగా.. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయారు. అజాన్ అవైస్, అరాఫత్ మిన్హాస్ 54 పరుగుల భాగస్వామ్యం మినహా పాక్ ఇన్నింగ్స్ లో చెప్పుదగ్గ విషయం లేదు. 79 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన పాక్ ను 133 పరుగుల వరకు చేర్చి పర్వాలేదనిపించారు. అయితే ఈ దశలో పాక్ బ్యాటర్లు మరోసారి వరుసగా క్యూ కట్టారు. దీంతో 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బౌలర్లలో పేస్ బౌలర్ టామ్ టామ్ స్ట్రాకర్ పాకిస్థాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 24 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి 4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. క్రీజ్ లో కొన్స్టాస్(6), డిక్సన్ (11) ఉన్నారు. ఆసీస్ గెలవాలంటే మరో 46 ఓవరల్లో 161 పరుగులు చేయాల్సి ఉంది.