ODI World Cup 2023: ఇదెక్కడి గోల.. ఆస్ట్రేలియా మాతాకి జై నినాదాలు

ODI World Cup 2023: ఇదెక్కడి గోల.. ఆస్ట్రేలియా మాతాకి జై నినాదాలు

సాధారణంగా భారత్ లో వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి "భారత్ మాతా కి జై" నినాదాలు సహజం. ఆస్ట్రేలియా పాకిస్థాన్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆసీస్ ఫ్యాన్స్ "భారత్ మాత కీ జై" అనే నినాదాలు చేసి టీమిండియాను సపోర్ట్ చేయడం అప్పుడు హైలెట్ గా మారితే.. తాజాగా ఆస్ట్రేలియా మాత కి జై నినాదాలతో  ధర్మశాల స్టేడియం హోరెత్తింది.

వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 28 న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. హిమాచల్ లోని ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అభిమానాలు ఆస్ట్రేలియా మాత కీ జై అంటూ స్టేడియంలో అరుస్తూ కనిపించారు. ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరణ్  డూప్ లా ఉన్న ఉన్న ఒక కుర్రాడు జై సియా రామ్, జై సియా రామ్ అంటూ ప్రేక్షకులకు ఊపు తెచ్చాడు. ఇంతలో ఇదే ఊపును కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మాత కీ జై అంటూ ఒక అభిమాని అందుకోగా అక్కడ ఉన్న అందరూ ఇదే జపాన్ని పలికారు.
 
ఇదంతా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జరిగింది. ఇక థ్రిల్లర్ గా ముగిసిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీ(109) తో కదం తొక్కగా.. వార్నర్ 82 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో కివీస్ చివరి వరకు పోరాడినా విజయం దక్కలేదు. రచీన్ రవీంద్ర (116) సెంచరీకి తోడు నీషం(57) వేగంగా ఆడి హాఫ్ సెంచరీ చేసాడు.