ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా స్క్వాడ్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ప్రిలిమినరీ స్క్వాడ్ ను సోమవారం (జనవరి 13) అనౌన్స్ చేశారు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును నడిపించనున్నాడు. కమ్మిన్స్ గాయంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ మెగా టోర్నీ సమయానికల్లా కోలుకుంటాడని ఆసీస్ యాజమాన్యం భావిస్తోందట. కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2023 లో టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. –
జట్టు విషయానికి వస్తే తొలిసారి మాట్ షార్ట్, ఆరోన్ హార్డీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇటీవలే దూసుకుపోతున్న జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ కు వన్డేజట్టులో స్థానం దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మెక్‌గర్క్ విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తో పాటు పేలవ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్‌లకు జట్టులో చోటు దక్కింది. ఫిబ్రవరి 22 న ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా ఇదే గ్రూప్ లో ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్స్ , ఆడమ్ జాంపా
AUSTRALIA SQUAD FOR CHAMPIONS TROPHY 2025 🏆
— Johns. (@CricCrazyJohns) January 13, 2025
Cummins (C), Carey, Ellis, Hardie, Hazlewood, Head, Inglis, Labuschagne, Marsh, Maxwell, Short, Smith, Starc, Stoinis, Zampa. pic.twitter.com/OPgYBA7qtY