
కారులో వెళ్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది . వెంటనే పక్కనున్న నదిలోకి కారును తిప్పారు. నీళ్లపై రయ్యిన దూసుకెళ్లి…. కావాల్సిన చోట మళ్లీ రోడ్డుపైకొచ్చింది. భలే ఉంది కదా.. ఇలా నీటిలో, నేలపై నడిచే కారునే ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ స్టూడెంట్ బీచెన్ నాన్ ‘యాంఫీ ఎక్స్’ పేరుతో తయారు చేశారు. నేలపై గంటకు 420 కి.మీ. వేగంతో, నీటిపై గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకెళ్లేలా రూపొందించారు. ముందుకు, వెనక్కే కాకుండా.. కుడి, ఎడమలకూ వెళ్లేలా టైర్లు డిజైన్ చేశామని నాన్ చెప్పారు. ఈ బ్యాటరీ కారు ధర జస్ట్ రూ. 23 కోట్లే.