ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా రూల్స్ మారాయి.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా రూల్స్ మారాయి.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ఒక వైపు అమెరికా ఆంక్షలతో ఇండియన్స్ ను తిరిగి పంపిస్తున్న తరుణంలో.. చాలా మందికి ఆస్ట్రేలియా ఆల్టర్నేటివ్ ఆప్షన్ అవుతోంది. ముఖ్యంగా స్టడీ పర్పస్ లో స్టూడెంట్స్ కు ఆస్ట్రేలియా బెస్ట్ డెస్టినేషన్ అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చవుదు కోసం ఆస్టేలియా వెళ్లాలనుకునే వారు స్టూడెంట్స్ వీసా రూల్స్ మారాయి. ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 

స్టూడెంట్స్ వీసాకు  సంబంధించి ఈ ఏడాది (2025) నుంచి రూల్స్ మారాయి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచడంలో భాగంగా వీసా అప్లికేషన్లలో మరింత కచ్చితత్వాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుత మార్పుల వలన మరింత మందిని ఆకర్శించడం వలన ఎకానమీకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆస్ట్రేలియా భావిస్తోంది. 

మారిన వీసా రూల్స్:

గతంలో వీసాకు అప్లై చేసుకునే స్టూడెంట్స్ కు వివిధ యూనివర్సిటీలు ఆఫర్ లెటర్ (Letter of Offer) ఇచ్చేవి. వీసా అప్లై చేసుకునేందుకు ఈ డాక్యుమెంట్ ముఖ్యమైంది. ఇందులో విద్యార్థికి సంబంధించిన సమాచారం, ఏ ప్రోగ్రామ్ కింద ఎన్ రోల్ అవుతున్నారు, కోర్స్ డ్యురేషన్, ఫీజులు, ఎప్పుడు జాయినింగ్ తదితర పూర్తి వివరాలు ఉండేవి. 

అయితే 1, జనవరి 2025 తర్వాత మారిన నిబంధనల ప్రకారం.. వీసా అప్లై చేసుకునే ప్రతి స్టూడెంట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ (Confirmation of Enrolment (CoE)) కచ్చితంగా ఉండాలి. లేదంటే అప్లికేషన్ ఇన్ వ్యాలిడ్ గా పరిగణిస్తారు.

కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్(CoE) అంటే అక్కడి యూనివర్సిటీలు  డిజిటల్ డాక్యుమెంటు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎన్రోల్ మెంట్ ను నిర్ధారించే (కన్ఫమ్) డిజిటల్ డాక్యుమెంట్. ఆఫర్ లెటర్ (Letter of Offer) లాగే ఇందులో కూడా విద్యార్థికి సంబంధించిన సమాచారం, ఏ ప్రోగ్రామ్ కింద ఎన్ రోల్ అవుతున్నారు, కోర్స్ డ్యురేషన్, ఫీజులు, ఎప్పుడు జాయినింగ్ వివరాలు ఉంటాయి. కాకపోతే విద్యార్థి జాయినింగ్ అవుతున్నట్లు కన్ఫమేషన్ ఇస్తే.. యూనివర్సిటీలో ఎన్ రోల్ మెంట్ డాక్యుమెంట్ ను పంపుతాయి. ఇది ఉంటేనే వీసా మంజూరు అవుతుంది.