కాన్బెర్రా: మా దేశంలో మస్తు ఉద్యోగాలు ఉన్నయ్.. స్టూడెంట్లకు చీప్‌గా వీసాలిస్తాం రండి అని ఆస్ట్రేలియా ప్రధాని మంత్రి స్కాట్ మారిసన్ ప్రకటించారు. స్టూడెంట్ లేదా వర్కింగ్ హాలిడే వీసాపై ఆస్ట్రేలియా వచ్చే వారికి అప్లికేషన్ ఫీజుపై రిబేట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి పెరిగి దేశంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. సూపర్ మార్కెట్లు, లాజిస్టిక్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ తదితర రంగాల్లో మ్యాన్‌పవర్ కొరత తీవ్రమైంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్పడనున్న క్రమంలో విదేశీ ఉద్యోగులతో ఖాళీలను భర్తీ చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసాలపై రిబేట్ ప్రకటించింది. బుధవారం కాన్బెర్రాలో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దేశ ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ.. మేము తీసుకున్న నిర్ణయం దేశంలో ఉద్యోగుల కొరతను తీరుస్తుందని ఆశిస్తున్నాం.. ‘కమాన్ ఆస్ట్రేలియా రండి.. ఇప్పుడే రండి’ అని ఆయన పిలుపునిచ్చారు. అయితే రిబేట్ ఎలా ఉంటుందనే విషయం చెప్పలేదు. వచ్చే 8 వారాల వరకు స్టూడెంట్లకు వీసాలపై రిబేట్వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం వీసాలపై ప్రకటించిన రిబేట్‌కు దాదాపు 55 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పాలసీతో 1,75, 000 మంది వీసాలకు దరఖాస్తు చేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ట్రెజరర్ జోస్ ఫ్రైడెన్బర్గ్చెప్పారు. కాగా ఆస్ట్రేలియా విదేశీ కార్మికులపై చాలా ఆధారపడుతోందని, కరోనాతో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే దేశంలో నిరుద్యోగులకు స్కిల్స్అందించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షనేత ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.
స్టూడెంట్లకు చీప్‌గా వీసాలిస్తాం రండి
- దేశం
- January 20, 2022
లేటెస్ట్
- సంక్రాంతి దేనికి ప్రతీక.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- Virat Kohli: బతిమిలాడి మరీ కోహ్లీకి నా జట్టులో ఛాన్స్ ఇస్తా: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్
- వైకుంఠ ఏకాదశి రోజు..తిరుమల వేంకటేశ్వరస్వామి10 మహిమలు తెలుసుకుందామా..!
- జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...డీసీఎం,తూఫాన్ వాహనం ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్
- మైక్రోసాఫ్ట్ షాక్ : పని చేయనోళ్ల ఉద్యోగాలు పీకేస్తున్నాం..
- Romantic Comedy OTT: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన సిద్దార్ధ్ లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ రేస్‌లో నలుగురు స్పిన్ ఆల్ రౌండర్లు.. ఇద్దరికే ఛాన్స్
- చైల్డ్ సైంటిస్టుల ప్రాజెక్టులు సూపర్ .. ముగిసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
Most Read News
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్