దుబాయ్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో అలీసా హీలీ (23 బాల్స్‌లో 5 ఫోర్లతో 37), ఎలీసా పెర్రీ (23 బాల్స్‌లో 2 ఫోర్లతో 22 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ ఓడిన పాక్ 19.5 ఓవర్లలో 82 రన్స్‌కే కుప్పకూలింది. అలియా రియాజ్ (26) టాప్ స్కోరర్. ఆష్లే గాడ్నెర్ (4/21) దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ కుదేలైంది.
ఇరామ్ జావేద్ (12), సిద్రా అమిన్ (12), నిడా డర్ (10)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సదర్లాండ్ (2/15), వారెహామ్ (2/16), మేఘన్ షుట్ (1/7), సోఫీ మోలినుక్స్ (1/19) పొదుపుగా బౌలింగ్ చేశారు. తర్వాత ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 83/1 స్కోరు చేసి నెగ్గింది.
బెత్ మూనీ (15), అలీసాతో కలిసి తొలి వికెట్‌కు 36 రన్స్ జోడించి ఔటైంది. మధ్యలో అలీసా రిటైర్డ్‌హర్ట్ అయినా ఎలీసా పెర్రీ వేగంగా ఆడింది. గాడ్నెర్ (7 నాటౌట్)తో కలిసి ఈజీగా గెలిపించింది. సైదా ఇక్బాల్ ఒక వికెట్ తీసింది. గాడ్నెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ఆరు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్‌కు దాదాపుగా చేరువైంది. ఆదివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియాతో తలపడుతుంది.