వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 369 రన్స్ టార్గెట్‌ను ఇచ్చింది. ఛేజింగ్‌లో శనివారం మూడో రోజు చివరకు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 111/3 స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (56 బ్యాటింగ్), డారిల్ మిచెల్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టామ్ లాథమ్ (8), విల్ యంగ్ (15), విలియమ్సన్ (9) ఫెయిలయ్యారు. ఆసీస్ బౌలర్లలో నేథన్ లైయన్ రెండు వికెట్లు పడగొట్టగా, ట్రావిస్ హెడ్ ఒక వికెట్ తీశాడు.
మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో కివీస్ విజయానికి ఇంకా 258 రన్స్ అవసరం కాగా, ఆసీస్‌కు 7 వికెట్లు కావాలి. అంతకుముందు 13/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 51.1 ఓవర్లలో 164 రన్స్‌కే ఆలౌటైంది. నేథన్ లైయన్ (41) టాప్ స్కోరర్. కామెరూన్ గ్రీన్ (34), హెడ్ (29) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. గ్లెన్ ఫిలిప్స్5, హెన్రీ 3 వికెట్లు తీశారు.