ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ జట్టుపై నవంబర్ 4 నుండి 18 వరకు వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య మొదట వన్డే ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు వరుసగా నవంబర్ 04, 08,10 తేదీలలో జరుగుతాయి. నవంబర్ 14, 16, 18 తేదీలలో వరుసగా మూడు టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్ లకు ఆస్ట్రేలియా ఇప్పటికే వన్డే జట్టును ప్రకటించగా.. తాజాగా టీ20 స్క్వాడ్ ను ప్రకటించారు. 13 మంది సభ్యులతో కూడిన జట్టులో ఈ జట్టుకు కెప్టెన్ ను ఎంపిక చేయలేదు.
Also Read :- గైక్వాడ్‌తో రోహిత్ ఢీ.. మ్యాచ్ ఎప్పుడంటే..?
ప్రస్తుతం ఆస్ట్రేలియూ వన్డే, టీ20 జట్లకు మిచెల్ మార్ష్ కెప్టెన్ గా ఉంటున్నాడు. నవంబర్ 22 నుంచి భారత్ తో బోర్డర్ గానస్కర్ ట్రోఫీ జరగనుండడంతో అతనికి టీ20 జట్టు నుంచి రెస్ట్ ఇచ్చారు. ఈ కారణంగానే మార్ష్ తో పాటు ట్రావిస్ హెడ్ కు టీ20 జట్టులో చోటు కల్పించలేదు.దీంతో ఆస్ట్రేలియాకు తాత్కాలిక కెప్టెన్ ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ తిరిగి ఆస్ట్రేలియా జట్టులో చేరారు. వెటరన్ ఆల్-రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్‌తో తమ స్థానాలను నిలుపుకున్నారు.
పాకిస్థాన్ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు:
సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
Cricket Australia has announced the squad for the white-ball series against Pakistan, starting next month at home.
— CricTracker (@Cricketracker) October 28, 2024
Xavier Bartlett, Nathan Ellis, and Spencer Johnson are set to rejoin the T20 squad after recovering from injuries. pic.twitter.com/Jap7t2kzGv