సెప్టెంబరులో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్ లతో ఆస్ట్రేలియా సిరీస్ లు ఆడనుంది. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు స్కాట్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఆస్ట్రేలియా యూకే పర్యటనను ప్రారంభించనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 11 నుండి 15 వరకు ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు.. సెప్టెంబర్ 19 నుండి 29 వరకు ఇంగ్లాండ్ తో ఐదు వన్డేల్లో కంగారూల జట్టు తలపడుతుంది. ఈ సిరీస్ లకు ఆస్ట్రేలియా క్రికెట్ తమ టీ20, వన్డే స్క్వాడ్ లను ప్రకటించింది.
వార్నర్ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ తొలిసారి టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నవంబర్ నెలలో టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉండడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు వన్డేల్లో రెస్ట్ ఇచ్చారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో విఫలమైనప్పటికీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై సెలక్టర్లు నమ్మకముంచారు. టీ20, వన్డే జట్టుకు మార్ష్ ను కెప్టెన్ గా ప్రకటించారు.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీని టీ20 జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గత రెండు సీజన్ లలో డొమెస్టిక్ సీజన్ లో ఫినిషర్ పాత్రలో కొన్నోలీని అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు టీ20 జట్టులో చోటు లభించలేదు. టీ20 వరల్డ్ కప్ ఆడిన మ్యాథ్ వేడ్, ఆస్టన్ అగర్ లకు వన్డే, టీ20 జట్టులో స్థానం దక్కలేదు.
ఆస్ట్రేలియా టీ20 జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.
Also Read:-అలాంటి ఆలోచన లేదు.. రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా వన్డే జట్టు
మిచ్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జాంపా.