మెల్‌బోర్న్: వర్క్‌లోడ్, బిజీ ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ కారణంగా పలు దేశాల క్రికెటర్లు వరల్డ్ టాప్ లీగ్ ఐపీఎల్‌కు దూరం అవుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ మాత్రం ఐపీఎల్‌ను వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. తనకు ఓపిక ఉన్నంత వరకూ లీగ్‌లో ఆడుతూనే ఉంటానని స్పష్టం చేశాడు. ‘ఇకపై నేను నడవలేను అన్నంత వరకు ఐపీఎల్ ఆడుతూనే ఉంటా.
బహుశా నా కెరీర్‌లో నేను ఆడే చివరి టోర్నమెంట్ ఐపీఎలే అవ్వొచ్చు. ఎందుకంటే ఈ లీగ్ నాకెంతో మేలు చేసింది. లీగ్‌లో నేను చాలా మంది వ్యక్తులు, కోచ్‌లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లను కలిశా. అది నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. రెండు నెలల పాటు డివిలియర్స్, కోహ్లీ లాంటి ప్లేయర్లతో డ్రెస్సింగ్ పంచుకుంటూ, వారితో మాట్లాడుతుంటే ఏ ఆటగాడైనా ఎంతో నేర్చుకుంటాడు’ అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.
ఇక వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడితే ఉపయోగం ఉంటుందన్నాడు. ఇక, ఇండియాను ఓడించి వన్డే వరల్డ్ కప్ నెగ్గిన ఆసీస్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలవడంపై దృష్టి పెట్టిందని తెలిపాడు.