వన్డేలకు వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌బై.. జనవరి 03న చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌

వన్డేలకు వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌బై.. జనవరి 03న చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌
  • రేపటి నుంచి పాక్‌‌‌‌‌‌‌‌తో తన చివరి టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌
  • టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతానని వెల్లడి

సిడ్నీ :  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి టెస్టు ఆడబోతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్‌‌‌‌‌‌‌‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై   టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే కొనసాగుతానని సోమవారం తెలిపాడు. అయితే, 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు తన అవసరం ఉంటే రీఎంట్రీకి సిద్ధంగా ఉంటానని వెల్లడించాడు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాతో ఆడిన వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనలే తనకు చివరి వన్డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అని చెప్పాడు. ఇండియాలో వరల్డ్ కప్ నెగ్గడం తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుర్తుండిపోయేవియమన్నాడు.

బుధవారం నుంచి తన హోమ్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌సీజీలో  ఆఖరి టెస్టు (పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో) ఆడబోతున్న వార్నర్ ఈ రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు సమయం లభిస్తుందన్నాడు. ఈ నిర్ణయం ఆసీస్ వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌ను కూడా కొంత ముందుకు సాగేలా చేస్తుందని అభిప్రాయపడ్డాడు. 2009లో హోబర్ట్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో వన్డే అరంగేట్రం చేసిన  డేవిడ్ తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 161  వన్డేలు ఆడి22 సెంచరీలు

33 ఫిఫ్టీల  సహా 6,932 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. రికీ పాంటింగ్ తర్వాత ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 111 టెస్టుల్లో 26 సెంచరీలతో 8,695 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌, బీబీఎల్‌‌‌‌‌‌‌‌తో పాటు  ఇంటర్నేషనల్ లీగ్ టీ20లోనూ పోటీపడనున్నాడు.